నూడుల్స్‌కట్‌లెట్‌

కావాల్సినవి: ఉడికించిన నూడుల్స్‌- పావుకేజీ, తురిమిన చీజ్‌- అరకప్పు, మైదా- రెండు టేబుల్‌స్పూన్లు, పాలు- రెండు కప్పులు,....

Updated : 15 Jun 2021 13:18 IST

పాఠక వంట

కావాల్సినవి: ఉడికించిన నూడుల్స్‌- పావుకేజీ, తురిమిన చీజ్‌- అరకప్పు, మైదా- రెండు టేబుల్‌స్పూన్లు, పాలు- రెండు కప్పులు, మీగడ- రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- సరిపడా, ఆవాలపొడి- పావు టీస్పూన్‌, మిరియాల పొడి- అర టీస్పూన్‌, నూనె- టీస్పూన్‌, బ్రెడ్‌పొడి- కొద్దిగా.

తయారీ: మీగడను వేడిచేసి అందులో మైదా వేసి రెండు నిమిషాలు వేయించాలి. దీంట్లో కొద్దికొద్దిగా పాలు పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. చీజ్‌, ఉప్పు, ఆవాల పొడి, మిరియాల పొడి, నూడుల్స్‌ కూడా జతచేసి బాగా కలపాలి. ప్లేటుకు నూనె రాసి ఈ మిశ్రమాన్ని దానిపై పరిచి అరగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత పిండి మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకుని బ్రెడ్‌ పొడిలో దొర్లించి కట్‌లెట్ల మాదిరిగా ఒత్తుకోవాలి. వీటిని పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత పాన్‌ వేడి చేసి కొద్దిగా నూనె పోసి కట్‌లెట్లు వేసి కాల్చాలి. ఇప్పుడు వీటిని తక్కువ మంట మీద బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు కాల్చాలి.

- ఆకాంక్ష, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని