బెళగావి కుంద భలే

కర్నాటకలోని బెళగావి వెళ్లిన వాళ్లు కుందా స్వీట్‌ తెచ్చుకోకుండా వెనక్కిరారని నానుడి. అంత అద్భుతమైన స్వీట్‌ తయారీ వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకప్పుడు రాజస్థాన్‌ నుంచి వచ్చిన

Published : 31 May 2020 00:25 IST

పక్కాలోకల్‌

కర్నాటకలోని బెళగావి వెళ్లిన వాళ్లు కుందా స్వీట్‌ తెచ్చుకోకుండా వెనక్కిరారని నానుడి. అంత అద్భుతమైన స్వీట్‌ తయారీ వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకప్పుడు రాజస్థాన్‌ నుంచి వచ్చిన మార్వాడీ అతను బెల్గాంలో స్వీట్‌షాప్‌ పెట్టాడు. అతడోరోజు పాలు కాస్తూ స్టవ్‌ ఆర్పడం మర్చిపోయి బయటకు వెళ్లిపోయాడు. రెండు గంటల తర్వాత వచ్చి చూస్తే పాలు మరిగి మరిగి సగం అయిపోయాయి. వాటిని రుచి చూస్తే అతడికి స్వీట్‌ తిన్నట్టే అనిపించిందట. ఆ పాలలో కాస్త కోవా వేసి మరిగించగానే దాని రుచి రెట్టింపైంది. ఆ రుచికి ఫిదా అయిన అతడు వెంటనే దానికి ‘కుంద’ అని పేరుపెట్టాడు. బెల్గాంలో తయారైంది కాబట్టి బెల్గాం కుందగా మారింది. దీన్ని మనమూ తయారుచేసుకుని మధురమైన ఆ రుచిని ఆస్వాదించవచ్ఛు

కావాల్సినవి: చిక్కని పాలు- రెండు లీటర్లు, పెరుగు- అరకప్పు, పంచదార- కప్పు, యాలకులపొడి- పావు టీస్పూన్‌, జీడిపప్పు, బాదాం- పావు కప్ఫు

తయారీ: స్టవ్‌ మీద మందపాటి గిన్నెలో పాలు పోసి తక్కువ మంట మీద ఉంచాలి. మధ్యమధ్యలో కలుపుతూ పాలు సగం అయ్యేంత వరకు మరిగించాలి. దీంట్లో పెరుగు పోసి పాలల్లో కలిసిపోయేలా బాగా కలపాలి. తర్వాత అర కప్పు పంచదార వేయాలి. ఇప్పుడు స్టవ్‌ మీద కడాయి పెట్టి మరో అర కప్పు పంచదార వేసి వేయిస్తే అది చిక్కటి ద్రవంలా తయారవుతుంది. దీన్ని పాల మిశ్రమంలో కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా గట్టిపడేంతవరకు గరిటెతో తిప్పుతుండాలి. చివరగా యాలకులపొడి వేసి పైన జీడిపప్పు, బాదాంలతో అలంకరించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని