గడ్డినువ్వుల కారంపొడి

కావాల్సినవి: గడ్డినువ్వులు (వెర్రినువ్వులు) - 100 గ్రా., ఎండుమిర్చి- 50గ్రా., మెంతులు, జీలకర్ర- స్పూన్‌ చొప్పున, కరివేపాకు- రెండు రెబ్బలు,

Updated : 15 Jun 2021 12:54 IST

పాఠకవంట

కావాల్సినవి: గడ్డినువ్వులు (వెర్రినువ్వులు) - 100 గ్రా., ఎండుమిర్చి- 50గ్రా., మెంతులు, జీలకర్ర- స్పూన్‌ చొప్పున, కరివేపాకు- రెండు రెబ్బలు, పసుపు- పావుటీస్పూన్‌, ఉప్పు-తగినంత, ఇంగువ- చిటికెడు.
తయారీ: గడ్డి నువ్వులను నీళ్లతో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే వీటిలో ఇసుక ఉంటుంది. బాగా ఆరిన తర్వాత కడాయిలో వేసి చిటపటలాడేంత వరకు వేయించాలి. తర్వాత ఎండుమిర్చి, మెంతుల, జీలకర్ర, కరివేపాకు వేయించాలి. దీంట్లో ఉప్పు, పసుపు, ఇంగు వేసి అన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే గడ్డినువ్వుల కారంపొడి రెడీ. ఇది అన్నం, ఇడ్లీ, దోసెల్లోకి చాలా బాగుంటుంది. ఇష్టమైతే వెల్లుల్లిరేకలు కూడా వేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని