ఫిరంగిపురం లూర్దుకొట్టు పకోడి

ఆత్రేయపురం అనగానే పూతరేకులు... తాపేశ్వరం అంటే కాజాలు వెంటనే గుర్తుకొస్తాయి కదా... అలాగే గుంటూరు జిల్లా ఫిరంగిపురం అనగానే.. చాలామందికి లూర్దుకొట్టు పకోడీ గుర్తుకువస్తుంది.

Updated : 15 Jun 2021 12:53 IST

పక్కాలోకల్‌

త్రేయపురం అనగానే పూతరేకులు... తాపేశ్వరం అంటే కాజాలు వెంటనే గుర్తుకొస్తాయి కదా... అలాగే గుంటూరు జిల్లా ఫిరంగిపురం అనగానే.. చాలామందికి లూర్దుకొట్టు పకోడీ గుర్తుకువస్తుంది. ఈ పకోడీ కమ్మటి రుచి, మసాలా వాసనతో వారం రోజులైనా కరకరలాడుతూ నిల్వ ఉంటుంది. రుచితోపాటుగా దీనికి సుదీర్ఘ చరిత్రా ఉంది. సుమారు వందేళ్ల కింద లూర్దు అనే వ్యక్తి ప్రత్యేకమైన పదార్థాలను కలుపుతూ దీన్ని తయారుచేయడం మొదలుపెట్టాడు. తనే సొంతంగా పిండి కలిపి పకోడీలు వేసేవాడు. అతడి తర్వాత కొడుకు శౌరయ్య తండ్రి దగ్గర నుంచి పకోడీలు వేయడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతడి నలుగురు కొడుకులు ‘లూర్దు పకోడి’ పేరుతో కొట్టు పెట్టుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ‘వందేళ్లు గడిచినా, తరాలు మారినా పకోడీ రుచిలో మాత్రం ఏమాత్రం తేడా లేదు’ అంటూ చాలామంది వేడివేడి ఈ పకోడీలను ఎంతో ఇష్టంగా ఆరగించేస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని