పండగ ప్రత్యేకం... గేవర్‌!

కలమ్‌, గేవర్‌ వినడానికి మనుషుల పేర్లలా ఉన్నా.. నిజానికి ఇవి స్వీట్ల పేర్లు. నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో వీటిని ప్రత్యేకంగా తయారుచేస్తారు. కొన్ని దశాబ్దాల కిందట రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన

Updated : 15 Jun 2021 12:51 IST

పక్కా లోకల్‌

కలమ్‌, గేవర్‌ వినడానికి మనుషుల పేర్లలా ఉన్నా.. నిజానికి ఇవి స్వీట్ల పేర్లు. నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో వీటిని ప్రత్యేకంగా తయారుచేస్తారు. కొన్ని దశాబ్దాల కిందట రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన రాంప్రసాద్‌ చిక్కని పాలను మరిగించి కలమ్‌ తయారుచేసేవాడు. దీనికి ఎంత గిరాకీ ఉన్నా నాణ్యత విషయంలో అతను ఎప్పుడూ రాజీపడలేదు. తొంభై ఏళ్లు వచ్చినా స్వయంగా తయారుచేసేవాడు. ఆయన కొడుకు ఇప్పుడు ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక గేవర్‌ విషయానికి వస్తే... సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ ప్రాంతంలో అందరికీ ఇదే గుర్తుకొస్తుంది. మైదా, పాలు, నెయ్యి, వనస్పతి, మిఠాయి రంగును ఉపయోగించి చిక్కని పాకంలా తయారుచేస్తారు. కాగే నూనెలో దీన్ని కొద్దికొద్దిగా పోయడంతో రంధ్రాలతో తెట్టులా తయారవుతుంది. దీని మీద చక్కెర పాకం పోసి తినడానికి సిద్ధం చేస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు కొన్న తర్వాత దీని మీద పాకం వేసుకుని తింటారు. భైంసా వాసులు ఇతర ప్రాంతాల్లోని తమ బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు ఈ స్వీటును తప్పకుండా తీసుకెళతారు.

- ఎన్‌.సాయిచరణ్‌ రెడ్డి, భైంసా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని