నోరూరించే చంబాచుక్‌..!

ఎర్రటి పచ్చడిని చూడగానే... వెంటనే నోట్లో నీళ్లూరతాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో తయారుచేసే చంబాచుక్‌ పచ్చడి కూడా సరిగ్గా అలాంటిదే. దీన్ని చంబా ప్రాంతంలో పండే మిర్చితో తయారుచేస్తారు.

Published : 17 Jan 2021 00:39 IST

పొరుగు రుచి...

ఎర్రటి పచ్చడిని చూడగానే... వెంటనే నోట్లో నీళ్లూరతాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో తయారుచేసే చంబాచుక్‌ పచ్చడి కూడా సరిగ్గా అలాంటిదే. దీన్ని చంబా ప్రాంతంలో పండే మిర్చితో తయారుచేస్తారు. కొంచెం కారంగా, మరికొంచెం తియ్యగా ఉండే ఈ పచ్చడిని చుక్‌ లేదా చంబాచుక్‌ అంటారు. పచ్చి లేదా ఎండుమిర్చితో చేసే ఈ పచ్చడి రుచి అదిరిపోతుందట. విందు భోజనంలో ఎన్ని రకాల పదార్థాలను వడ్డించినా.. పచ్చడి లేనిదే ముద్ద మింగుడు పడదు చాలామందికి. అలాంటివాళ్లంతా దీన్ని ఇష్టపడకుండా ఉండలేరు. చలికాలంలో ఈ పచ్చడిని ఎంతో ప్రత్యేకంగా, ఇష్టంగా తింటుంటారు హిమాచల్‌వాసులు. చపాతీ లేదా ఇతర పదార్థాల్లో దీన్ని నంజుకుని తింటే... స్వర్గం ఎక్కడో దూరంలో ఉండదంటారు ఆహార ప్రియులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని