కప్పులకూ వేద్దాం కోట్లు!

కాగితంతో చేసిన కప్‌స్లీవ్స్‌ను చూసే ఉంటారు. కానీ ఇలా చక్కగా ఊలుతో అల్లిన అందమైన వాటిని మాత్రం చూసుండరు. తెల్లని కప్పులు వివిధ రంగులు,

Published : 17 Jan 2021 00:42 IST

సౌకర్యం

కాగితంతో చేసిన కప్‌స్లీవ్స్‌ను చూసే ఉంటారు. కానీ ఇలా చక్కగా ఊలుతో అల్లిన అందమైన వాటిని మాత్రం చూసుండరు. తెల్లని కప్పులు వివిధ రంగులు, డిజైన్లతో చూడచక్కగా మారాలంటే వీటిని వేయాల్సిందే. కావాల్సిందల్లా కాస్తంత ఊలు మరికాస్త సృజన. మనసైన వారికి రోజూ అందించే కాఫీ కప్పు మీద.. మీ హృదయాన్ని ముద్రించేయండి. అలాగే చూడముచ్చటైన సుమాలనూ కప్పు మీద అల్లేయండి. మీకు నచ్చిన వివిధ డిజైన్లతో కప్పులను అలంకరిస్తే.. చూసేవాళ్లు పులకరించకుండా ఎలా ఉండగలరు చెప్పండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని