రవ్వ అప్పం

బొంబాయి రవ్వ- కప్పు, అటుకులు- ముప్పావు కప్పు, పెరుగు- అరకప్పు, పంచదార- రెండు టీస్పూన్లు, ఉప్పు- సరిపడా, బేకింగ్‌ సోడా- పావు టీస్పూన్‌.

Updated : 15 Jun 2021 12:43 IST

చెఫ్‌ ప్రత్యేకం

కావాల్సినవి: బొంబాయి రవ్వ- కప్పు, అటుకులు- ముప్పావు కప్పు, పెరుగు- అరకప్పు, పంచదార- రెండు టీస్పూన్లు, ఉప్పు- సరిపడా, బేకింగ్‌ సోడా- పావు టీస్పూన్‌.
తయారీ: బొంబాయి రవ్వ, అటుకులను మిక్సీలో వేసి నీళ్లు పోయకుండా మెత్తగా పొడి చేయాలి. దీంట్లో పెరుగు, పంచదార, ఉప్పు, కప్పు నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో బేకింగ్‌ సోడా వేయాలి. పెనానికి నూనె రాసి వేడిచేసి దోసె వేయాలి. మధ్యస్థంగా ఉండే మంట మీద దీన్ని ఉడికించాలి. ఉల్లిపాయ చట్నీతో తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని