తాటిబెల్లం మరమరాల లడ్డూ!

తాటిబెల్లం-కప్పు, మరమరాలు-రెండు కప్పులు, కొబ్బరి తురుము-చెంచా, సోంపు పొడి-చిటికెడు.

Updated : 15 Jun 2021 12:41 IST

పాఠక వంట

కావాల్సినవి: తాటిబెల్లం-కప్పు, మరమరాలు-రెండు కప్పులు, కొబ్బరి తురుము-చెంచా, సోంపు పొడి-చిటికెడు.
తయారీ: బాణలీలో మరమరాలు వేసి కాస్త వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాణలీలో తాటిబెల్లం, కొద్దిగా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. పాకం చిక్కగా అయ్యేవరకు మరిగించాలి. ఇప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసి బాగా మరిగించిన బెల్లంపాకంలో సోంపు పొడి వేసి కలపాలి. ఆ తర్వాత మరమరాలు, కొబ్బరి పొడి వేసి మరోసారి బాగా కలియబెట్టాలి. వేడిగా ఉన్నప్పుడే చేతులకు కాస్త నెయ్యి రాసుకుని వీటిని తీసుకుని లడ్డూల్లా చేయాలి. అంతే రుచికరమైన తియ్యతియ్యని, కరకరలాడే తాటిబెల్లం మరమరాల లడ్డూలు రెడీ. వీటిని స్నాక్స్ లా తీసుకోవచ్చు. దీంట్లో వేసిన బెల్లం మన శరీరానికి కావాల్సిన ఐరన్‌ను అందజేస్తుంది. అలాగే కొబ్బరిలోని పోషకాలు ఆరోగ్యాన్ని, అందాన్నీ ఇస్తాయి. ముఖ్యంగా చిన్నారులు, మహిళలకు ఇది బలవర్థకమైన ఆహారం. ట్రై చేసేయండి మరి.

- కాకర్ల శశిరేఖ, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని