ఆహారానికి గొడుగు మూత!

అన్నం, కూర, పప్పు... ఇలా అన్ని పాత్రలపైనా వేడి చల్లారకుండా ఉండేందుకు మూతలు పెట్టడం మనకు అలవాటే. అయితే ఆహార పదార్థాలు తాజాగా, వేడిగా, పోషకాలు పోకుండా ఉండాలంటే వాటిపై ఓ పెద్ద గొడుగు

Published : 23 May 2021 00:29 IST

వంటింటి నేస్తం

అన్నం, కూర, పప్పు... ఇలా అన్ని పాత్రలపైనా వేడి చల్లారకుండా ఉండేందుకు మూతలు పెట్టడం మనకు అలవాటే. అయితే ఆహార పదార్థాలు తాజాగా, వేడిగా, పోషకాలు పోకుండా ఉండాలంటే వాటిపై ఓ పెద్ద గొడుగు లాంటి మూత పెడితే ఎలా ఉంటుంది. అచ్చం ఈ ఫొటోలో చూపినట్లే ఉంటుంది. అల్యూమీనియంతో చేసిన ఈ ‘హీట్‌ హోల్డింగ్‌ ఫుడ్‌ కవర్లు’ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆహార పదార్థాలను తాజాగా, వేడిగా ఉంచుతాయి. దుమ్మూ, ధూళీ పడకుండా, క్రిమికీటకాలు దరిచేరకుండా అడ్డుకుంటాయి. దీనికింద ఒకేసారి అయిదారు ఆహారపదార్థాలను భద్రపరచొచ్చు.  ఆకర్షణీయమైన రంగుల్లోనూ లభ్యమయ్యే ఈ కవర్లు భోజనాల బల్లకు సరికొత్త అందాన్నీ ఇస్తాయి. వీటిని అవసరం లేకపోతే మడిచి పక్కన పెట్టేయొచ్చు కూడా. సులువుగా ఎక్కడికైనా తీసుకువెళ్లొచ్చు. బాగున్నాయి కదూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని