జపాన్‌ చేప కేకులివి!

ఫొటోల్లోని కేకులను చూస్తే తినేయాలనిపిస్తోంది కదూ... మృదువుగా, క్రీమ్‌తో ఆకర్షణీయమైన ఆకారాల్లో ఉన్న వాటిని చూస్తే ఎవరికైనా నోరూరుతుంది మరి అంటారా. అయితే ఇక్కడ కనిపిస్తోన్న వీటికో ప్రత్యేకత ఉంది.

Published : 23 May 2021 00:29 IST

పొరుగు రుచి

ఫొటోల్లోని కేకులను చూస్తే తినేయాలనిపిస్తోంది కదూ... మృదువుగా, క్రీమ్‌తో ఆకర్షణీయమైన ఆకారాల్లో ఉన్న వాటిని చూస్తే ఎవరికైనా నోరూరుతుంది మరి అంటారా. అయితే ఇక్కడ కనిపిస్తోన్న వీటికో ప్రత్యేకత ఉంది. ఈ కేకులను చేప గుజ్జుతో తయారుచేస్తారు...
కమాబొకొ అనేది ఒకరకమైన జపాన్‌ కేకు. దీన్ని ఆ దేశంలో దొరికే తెల్ల చేప ‘సురిమి’ గుజ్జుతో తయారుచేస్తారు. ఈ కేకు తయారీలో చేప గుజ్జుతోపాటు గుడ్డులోని తెల్లసొన, చక్కెర, ఉప్పు, జపనీస్‌ రైస్‌ వైన్‌, పిండినీ వాడతారు. దాంతో కేకు ఎంతో మృదువుగా, రసగుల్లాలా ఉంటుంది. దీని తయారీలో ఎలాంటి రంగులు, ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించరు. అయితే వీటిని మనం తినే కేకుల్లా కాకుండా వేడి వేడి సూపులతోనో, సాసుల్లో నంజుకునో తింటారు. సాధారణంగా కమాబొకొ అనే ఈ కేకు స్థూపాకారంలో  దొరుకుతుంది. కొన్నిచోట్ల మాత్రం రకరకాల ఆకారాల్లోనూ తయారుచేస్తారు. ఈ కేకులను కేవలం బేక్‌ చేయడమే కాదు ఆవిరి మీద ఉడికించి, డీప్‌ ఫ్రై చేసి కూడా తయారుచేస్తారు. ఎరుపు, తెలుపు కమాబొకోలను ప్రత్యేకమైన రోజులు, వేడుకల్లో తప్పనిసరిగా సర్వ్‌ చేస్తారు. ఈ రెండు రంగులు మంచి చేస్తాయని జపనీయుల నమ్మకం. పద్నాలుగో శతాబ్దం నుంచే వాడుకలో ఉన్నా ఇవి ప్రస్తుతం ప్రపంచం మొత్తం విస్తరించాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని