రావి ఆకులే... టీ జాలీలుగా!

సాధారణంగా టీ వడకట్టడానికి మనం స్టీలు, ప్లాస్టిక్‌ జాలీని( స్టెయినర్‌) ఉపయోగిస్తాం. అయితే ఈ చిత్రంలో కనిపిస్తోన్న స్టెయినర్‌ కొత్తది, ప్రత్యేకమైంది. ప్రస్తుతం ఈ రావి ఆకు స్టెయినర్‌లు ఆన్‌లైన్‌ మార్కెట్లో సందడి

Updated : 15 Jun 2021 12:33 IST

వంటింటి పరికరం

సాధారణంగా టీ వడకట్టడానికి మనం స్టీలు, ప్లాస్టిక్‌ జాలీని( స్టెయినర్‌) ఉపయోగిస్తాం. అయితే ఈ చిత్రంలో కనిపిస్తోన్న స్టెయినర్‌ కొత్తది, ప్రత్యేకమైంది. ప్రస్తుతం ఈ రావి ఆకు స్టెయినర్‌లు ఆన్‌లైన్‌ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. కప్పు మీద ఈ సున్నితమైన, ప్రకాశవంతమైన పత్రాన్ని పెట్టి టీ ఒంపితే చాలు. ఆ తర్వాత ఈ ఆకును నీళ్లతో శుభ్రం చేసి ఆరబెడితే సరి. ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని రుద్దకూడదు. ఏ ఒక్క ఆకూ ఒకేలా ఉండదు. కాబట్టి ప్రతి స్టెయినర్‌ ప్రత్యేకమైందే. అత్యంత నాణ్యమైన, పారదర్శకమైన, తేలికైన, పలుచటి సహజసిద్ధమైన రావి ఆకుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. ఆకర్షణీయమైన వీటిని టీ స్టెయినర్‌లుగానే కాకుండా బుక్‌ మార్క్‌గానూ ఉపయోగించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని