చిట్టి చాపర్స్‌!

ఉల్లిపాయలు, వెల్లుల్లి, టొమాటోలు, మిర్చీ.. ఒకట్రెండింటిని మిక్సీ పట్టుకోవాలంటే ఇబ్బందే అంటారా... అలాంటి వారికోసమే అందుబాటులోకి వచ్చాయి...

Published : 13 Jun 2021 01:16 IST

వంటింటి నేస్తం

ల్లిపాయలు, వెల్లుల్లి, టొమాటోలు, మిర్చీ.. ఒకట్రెండింటిని మిక్సీ పట్టుకోవాలంటే ఇబ్బందే అంటారా... అలాంటి వారికోసమే అందుబాటులోకి వచ్చాయి... ఈ ‘మినీ ఎలక్ట్రికల్‌ ఫుడ్‌ చాపర్‌లు’. బ్యాటరీతో పనిచేస్తాయివి. జార్‌లో ముక్కలు వేసి మూతపెట్టి, పైనున్న మీట నొక్కితే చాలు క్షణాల్లో తరుగు సిద్ధమైపోతుంది. ఉల్లిపాయలు, అల్లం, నట్స్‌, ఆకుకూరలు, మిరియాలు.. ఇలా వేటినైనా పొడి/పేస్ట్‌ చేసి పెట్టుకోవచ్చు. ఈ పరికరాన్ని శుభ్రం చేయడం, భద్రపరచడం కూడా సులువే. దీనిలోని పదునైన బ్లేడ్లు కూరగాయలు, మాంసాన్ని ముద్ద చేసేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని