కొంచెం చాలు... ఆరోగ్యానికి మేలు!

ఫ్రూట్‌ సలాడ్లు, ఆమ్లెట్‌, రైతా... ఇలా రకరకాల వంటకాల్లో మిరియాల పొడిని కాసింత తప్పకుండా వేసుకుంటాం. కొద్దిగా వాడినా దీనివల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి.

Published : 13 Jun 2021 01:19 IST

పోషకాలమ్‌

ఫ్రూట్‌ సలాడ్లు, ఆమ్లెట్‌, రైతా... ఇలా రకరకాల వంటకాల్లో మిరియాల పొడిని కాసింత తప్పకుండా వేసుకుంటాం. కొద్దిగా వాడినా దీనివల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి.
* మిరియాల్లోని ‘పెపరిన్‌’ అనే రసాయనం ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగవు. ఫలితంగా మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
* మిరియాలు దగ్గును కూడా తగ్గిస్తాయి. ఆ సమస్యతో బాధపడుతున్నప్పుడు మిరియాల పాలు, చారు లాంటివి తీసుకోమంటుంటారు పెద్దవాళ్లు. మిరియాల పొడి, తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.  
* పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచడానికి, చెడు బ్యాక్టీరియాను తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. అధిక ఆకలిని నియంత్రిస్తాయి.
* మోకాళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని