వేపుడు పొడిపొడిగా రావాలంటే?

బెండకాయ వేపుడు చేసినప్పుడల్లా మాడిపోవడమో, జిగురుగా, ముద్దగా మారడమో అవుతోంది. అలా కాకుండా పొడి పొడిగా, రుచిగా రావాలంటే ఏం చేయాలి?

Updated : 15 Jun 2021 12:31 IST

బెండకాయ వేపుడు చేసినప్పుడల్లా మాడిపోవడమో, జిగురుగా, ముద్దగా మారడమో అవుతోంది. అలా కాకుండా పొడి పొడిగా, రుచిగా రావాలంటే ఏం చేయాలి? -ప్రపవీణ, హైదరాబాద్‌

* వేపుడుకు లేత బెండకాయలను ఎంచుకోవాలి. వాటిని కడిగి శుభ్రమైన వస్త్రంతో తడి లేకుండా తుడవాలి. అలాగే కాసేపు గాలికి ఆరబెట్టాలి.
* ముక్కలను కోసేటప్పుడు మరీ సన్నగా తరిగితే చిదిమి పోతాయి. కాబట్టి మామూలుగానే కాస్త మందంగానే కోసుకోవాలి.
* వేపుడుకు మందమైన అడుగు ఉన్న కడాయిని తీసుకోవాలి. పలుచటి అడుగుంటే ముక్కలు త్వరగా మాడిపోతాయి.
* తాలింపులో ముక్కలు వేసిన రెండు నిమిషాలకే పసుపు వేయాలి. అలాగే చెంచా పెరుగు వేస్తే రుచి పెరుగుతుంది. ముక్కల నుంచి  జిగురు రాదు. వేపుడు కూడా పొడి పొడిగా ఉంటుంది. చెంచా సెనగపిండీ కలపొచ్చు. ఇది తడిని పీల్చుకుంటుంది.
* బెండకాయను పెద్ద మంటలో వేయించకూడదు. మీడియం లేదా చిన్న మంటపై ఫ్రై చేయాలి. అలా చేస్తే ముక్కలు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. పెద్ద మంటపై వేయిస్తే నల్లగా మారతాయి.
* ఉప్పును చివర్లో కలపాలి. ఎక్కువసార్లు కలిపితే ముక్కలు చిదిమిపోయి ముద్దలా మారతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని