మ్యాగీ నూడుల్స్‌ మంచూరియా

మ్యాగీ, మసాలా ప్యాకెట్లు- రెండు చొప్పున, నీళ్లు- ఒకటిన్నర కప్పులు, సన్నగా కోసిన ఉల్లిపాయలు, స్ప్రింగ్‌ ఆనియన్స్‌- కొన్ని;

Updated : 15 Jun 2021 12:30 IST

కావాల్సినవి
మ్యాగీ, మసాలా ప్యాకెట్లు- రెండు చొప్పున, నీళ్లు- ఒకటిన్నర కప్పులు, సన్నగా కోసిన ఉల్లిపాయలు, స్ప్రింగ్‌ ఆనియన్స్‌- కొన్ని; క్యారెట్‌, క్యాబేజీ తురుము- రెండు పెద్ద చెంచాల చొప్పున, ఉప్పు- తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, మైదా- అరకప్పు, మ్యాగీ నూడుల్స్‌- ప్యాకెట్‌ (అవుటర్‌ లేయర్‌ కోసం), నూనె- తగినంత.

గ్రేవీకి కావాల్సినవి
నూనె- రెండు పెద్ద చెంచాలు, సన్నగా తరిగిన వెల్లుల్లి- రెండు చెంచాలు, పచ్చిమిర్చి- రెండు, అల్లం- అంగుళం ముక్క(సన్నగా తురుముకోవాలి), స్ప్రింగ్‌ ఆనియన్‌ తరుగు- రెండు పెద్ద చెంచాలు, ఉల్లిపాయ, క్యాప్సికమ్‌- సగం ముక్క చొప్పున, టొమాటో సాస్‌, వెనిగర్‌- రెండు పెద్ద చెంచాల చొప్పున, చిల్లీసాస్‌, సోయాసాస్‌- పెద్ద చెంచా చొప్పున, మిరియాల పొడి- చెంచా, ఉప్పు- తగినంత, కార్న్‌ఫ్లోర్‌- పెద్ద చెంచా.

తయారీ
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి నీళ్లు పోసి అందులో మ్యాగీ మసాలా వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మ్యాగీ నూడుల్స్‌ వేసి రెండు నిమిషాలపాటు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని చల్లార్చాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌, క్యాబేజీ, స్ప్రింగ్‌ ఆనియన్స్‌, అల్లంవెల్లుల్లి తరుగు, చిల్లీసాస్‌, తగినంత ఉప్పు వేసి ముద్దగా కలపాలి.

ఈ ముద్దను చిన్న ఉండల్లా చేసి కరకరలాడేలా డీప్‌ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె పోసి వేడయ్యాక అందులో అల్లంవెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, స్ప్రింగ్‌ ఆనియన్స్‌ వేసి అర నిమిషం పాటు వేయించాలి. ఈ మిశ్రమంలో ఉల్లి, క్యాప్సికమ్‌ ముక్కలను మంట పెద్దదిగా చేస్తూ ఫ్రై చేయాలి. ఇలా వేయించిన దాంట్లో టొమాటో, చిల్లీ, సోయా సాస్‌లు, వెనిగర్‌, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమంతోపాటు ఇందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఉడికిన గ్రేవీలో వేయించిన మ్యాగీ నూడుల్‌్్స మంచూరియా వేసి నిమిషంపాటు పెద్ద మంటపై ఉడికించాలి. వీటిని స్ప్రింగ్‌ ఆనియన్స్‌తో గార్నిష్‌ చేసి వేడివేడిగా టొమాటో సాస్‌తో తింటే బాగుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు