సింకులో సిలికాన్‌ స్టార్‌!

వంటింట్లో పొయ్యితోపాటు ఎక్కువగా వాడేది సింకునే. కొందరిళ్లల్లో ఇది ఎప్పుడూ గిన్నెలతో నిండి ఉంటుంది మరికొందరేమో అన్నం మెతుకులు, ఆకుకూర తరుగులు, ఉల్లిముక్కలు...

Updated : 20 Jun 2021 00:36 IST

వంటింటి నేస్తం

వంటింట్లో పొయ్యితోపాటు ఎక్కువగా వాడేది సింకునే. కొందరిళ్లల్లో ఇది ఎప్పుడూ గిన్నెలతో నిండి ఉంటుంది మరికొందరేమో అన్నం మెతుకులు, ఆకుకూర తరుగులు, ఉల్లిముక్కలు... ఇలా చిన్న చిన్న ఆహార వ్యర్థాలన్నీ నేరుగా సింక్‌లో వేసేస్తారు. ఇలా చేస్తే ఇవన్నీ పైప్‌లో అడ్డుపడి నీళ్లు పోవడం కష్టమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ నక్షత్రాన్ని ఇంటికి తేవాల్సిందే.

ఏంటా నక్షత్రం?

సింకులో చిన్న చిన్న ఆహారపు పదార్థాలు నేరుగా పైప్‌లోకి వెళ్లకుండా ఉండేందుకు జాలీ (ఫిల్టర్‌) లాంటిది పెడతారు కదా! అలాంటిదే ఈ నక్షత్ర జాలీ. స్టార్‌ ఆకారంలో ఉండే దీనికి అడుగు భాగాన అతికించడానికి వీలుగా ఉంటుంది. సిలికాన్‌తో తయారైన ఈ స్టార్‌ జాలీలు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాదు వీటిని శుభ్రం చేయడం కూడా సులువే. నీళ్లు పోయే సింకు హోల్‌పై పెట్టి కాస్త గట్టిగా అదిమితే అతుక్కుపోతుంది.  సింకూ కొత్తగా కనిపిస్తుంది. వ్యర్థాలు లోపలికి పోవు. మీరూ చూసేయండి మరి. కేవలం వంటింట్లో పాత్రలు తోమే చోట కాకుండా ఇతర సింకుల్లోనూ దీన్ని పెట్టొచ్చు. నీళ్లు కూడా దీని రంధ్రాల వెంబడి సులువుగా వెళ్లిపోతాయి.  

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని