ఉప్మా రుచిగా రావాలంటే ఏం చేయాలి?
ప్రశ్న- జవాబు
ఉప్మా చేసినప్పుడల్లా పిల్లలు అస్సలు తినడం లేదు. ఎన్ని రకాలుగా చేసినా నచ్చలేదంటారు. దీన్ని రుచికరంగా, చిన్నారులు మెచ్చేలా ఎలా చేయాలి?
-శ్వేత, హైదరాబాద్
ఉప్మా రుచిగా రావాలంటే నాణ్యమైన ఉప్మారవ్వను ఎంచుకోవాలి.
* రవ్వను ముందుగా దోరగా వేయించుకోవాలి. ఇలా చేస్తే కమ్మటి వాసనతోపాటు ఉప్మా ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది.
* నూనెతో కాకుండా ఆవు నెయ్యితో చేసుకుంటే రుచి, ఆరోగ్యం రెండూ వస్తాయి.
* ఈ అల్పాహారంలో ఉల్లిపాయలు ఎక్కువగా వేయకూడదు. అసలు వేయకుండా చేసిన ఉప్మా చాలా రుచిగా ఉంటుంది.
* దీని తయారీకి వాడే కడాయి/గిన్నె అడుగు భాగం చాలా మందంగా ఉండాలి. పలుచగా ఉంటే త్వరగా అడుగంటుతుంది.
* మరిగే నీళ్లలో కొద్దికొద్దిగా రవ్వ పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి.
* పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇందులో జీడిపప్పు, వేరుసెనగపప్పులు వేసుకోవాలి. బీన్స్, క్యారెట్, పనీర్, కొత్తిమీరా, బఠానీలను తాలింపులో వేస్తే రుచి పెరుగుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.
* ఈ టిఫిన్ను వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి. అప్పుడే రుచిగా ఉంటుంది. టేస్ట్ పెరగడానికి నీళ్లలో ఉప్పుతోపాటు కాస్తంత పంచదార కూడా కలుపుతుంటారు కొందరు. సన్నగా తురిమిన అల్లం ముక్కలను వేసుకుంటే ప్రత్యేకమైన రుచి వస్తుంది.
* పల్లీలను ముందుగా నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఉప్మా అంతా తయారైన తర్వాత చివరగా వేసుకుంటే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
* చిన్నారులు ఉప్మాను ఇష్టపడాలంటే ఉప్మా తయారైన తర్వాత కాజూ, పల్లీలు, సేవ్, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి పెడితే ఇష్టంగా తింటారు.
* వడ్డించడానికి ముందు చెంచా నిమ్మరసం కలిపితే మరింత రుచి పెరుగుతుంది. అలాగే చెంచా నెయ్యిని కూడా జోడిస్తే అదనపు రుచి మీ సొంతమవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ఐపీఎల్ ఆల్టైమ్ ‘XI’.. కెప్టెన్సీపై చర్చ.. ఓజా ఎంపిక ఎవరంటే?
-
Politics News
Krishna: వైకాపాలో భగ్గుమన్న విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు
-
Politics News
Nara lokesh: సమస్యలు తెలుసుకుంటూ.. బీసీలకు భరోసానిస్తూ: రెండో రోజు లోకేశ్ పాదయాత్ర
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్కౌర్
-
Sports News
Team India: దిగ్గజాల వారసత్వాన్ని కొత్తవారు కొనసాగించడం కష్టమే: పద్మశ్రీ గురుచరణ్ సింగ్