చికెన్‌ టిక్కా మసాలా

కావాల్సినవి:  చికెన్‌- అర కిలో, పెరుగు- అర కప్పు, జీలకర్ర పొడి, యాలకుల పొడి- పెద్ద చెంచా చొప్పున, ధనియాల పొడి- ఒకట్నిర పెద్దచెంచా, పసుపు- అర చెంచా, అల్లం- చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు-

Published : 27 Jun 2021 00:23 IST

పాఠక వంట

కావాల్సినవి:  చికెన్‌- అర కిలో, పెరుగు- అర కప్పు, జీలకర్ర పొడి, యాలకుల పొడి- పెద్ద చెంచా చొప్పున, ధనియాల పొడి- ఒకట్నిర పెద్దచెంచా, పసుపు- అర చెంచా, అల్లం- చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, కారం- చెంచా, మెంతుల పొడి- చెంచా, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు - కొద్దిగా, ఎండిన మెంతి ఆకులు- కాసిన్ని.

తయారీ: చికెన్‌ను శుభ్రంగా కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో పెరుగు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతి పొడి, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు వేసి అరగంటపాటు మారినేట్‌ చేయాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక చికెన్‌ ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.

తర్వాత మరో పాన్‌ పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. దీనికి జీడిపప్పు జత చేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి.

ఇప్పుడు మరోసారి పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టాలి. దీంట్లో వెన్న వేసి కరిగిన తర్వాత లవంగాల పొడి, యాలకుల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముద్ద జత చేసి కొన్ని నిమిషాలపాటు వేయించాలి. ఎండిన మెంతి ఆకులను పొడిలా చేసి పైన చల్లాలి. చికెన్‌ ముక్కలతోపాటు తగినంత ఉప్పు, క్రీమ్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అయిదు నిమిషాలు చిన్నమంటపై ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేస్తే చాలు.


మసాలా గ్రేవీకి.. ఉల్లిపాయలు- రెండు, టొమాటోలు- నాలుగు, జీడిపప్పు- పది, జీలకర్ర పొడి- పెద్ద చెంచా, లవంగం పొడి - పావు చెంచా, తాజా క్రీమ్‌- అర కప్పు, నూనె- కావాల్సినంత, ఉప్పు- సరిపడా



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని