తియ్యటి రొట్టె షాహీ షీర్మల్
పొరుగు రుచి
దిల్లీ వెళ్లినవాళ్లు జామా మసీద్ చూడకుండా ఉండరు. అలానే ఆ ప్రాంతంలోని ఓ ప్రత్యేకమైన రోటీనీ రుచి చూడకుండా రారు. అదేనండి షాహీ షీర్మల్... తియ్యతియ్యటి ఈ రొట్టెను ... డ్రైఫ్రూట్స్ చపాతీ అని కూడా పిలుస్తారు.
ఇదొక రకమైన డ్రైఫ్రూట్ దిబ్బరొట్టె అని చెప్పొచ్చు. దిల్లీకి చెందిన అతి పురాతన మైన వంటకమిది. చాలామంది ఇప్పటికీ దీన్ని తయారుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దిల్లీవాసులు అమితంగా ఇష్టపడే ఈ మొఘలాయి వంటకాన్ని అక్కడివారితోపాటు పర్యాటకులు ఇష్టంగా తింటారు.
ప్రత్యేకతలివి..
మైదాపిండి, సెనగపిండి, రవ్వ, నెయ్యి, కోవా, పాలతో చపాతీ పిండి మిశ్రమాన్ని తయారుచేస్తారు. కాస్త మందంగా చపాతీ చేసిన తర్వాత దానిపై చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. బాదం, కాజు, పిస్తా, అక్రూట్‌లను రొట్టెకు ఒక వైపు అతికిస్తారు. దీనిపై పిస్తా పొడి, నువ్వులను చల్లుతారు. ఆ తర్వాత చేత్తో గట్టిగా అదిమి చపాతీల కర్రతో మరోసారి నొక్కుతారు. ఆ తర్వాత ఓ పెద్ద పాత్ర లోపల అంటించి పది నిమిషాలపాటు బొగ్గులపై కాలుస్తారు. ఇది చపాతీలా మారిన తర్వాత చల్లార్చి పూర్తిగా దేశీ నెయ్యిలో ముంచుతారు. దాంతో దీని రుచి బాగా పెరుగుతుంది. దీని ధర రూ.25 నుంచి నాలుగైదు వందల రూపాయల వరకు ఉంటుంది. ఒక్కోచోట ఒక్కోలా తయారుచేస్తారు. కొన్ని చోట్ల రొట్టెపై పూర్తిగా బాదం, కాజు, పిస్తాలను అతికిస్తే మరికొన్ని చోట్ల వాటిని చిన్న ముక్కలుగా చేసి చపాతీకి అద్దుతారు. వినియోగదారుల కోరిక మేరకు ఎలా కావాలంటే అలా దొరుకుతాయక్కడ. అలాగే ఇరవై నాలుగ్గంటలూ వీటి అమ్మకం కొనసాగుతుంది. ఈ రొట్టెలు దాదాపు నెలరోజులపాటు నిల్వ ఉంటాయి. ఈ రుచికరమైన వంటకాన్ని ఆర్డర్ ద్వారా మనమూ తెప్పించుకోవచ్చు..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Director Sagar: ‘స్టూవర్టుపురం దొంగలు’ తీసి చిరంజీవిని కలవలేకపోయిన దర్శకుడు సాగర్
-
India News
Siddique Kappan: 28 నెలల తర్వాత.. కేరళ జర్నలిస్టు కప్పన్ బెయిల్పై విడుదల
-
India News
‘మీరు లేకుండా మేం మెరుగ్గా ఉన్నాం’.. బెంగాల్ సీఎంపై వర్సిటీ తీవ్ర వ్యాఖ్యలు..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య
-
World News
Miss Universe : మిస్ యూనివర్స్ పోటీలు.. నన్ను చూసి వారంతా పారిపోయారు..!