తియ్యనైన చికెన్‌ టిక్కా!

కచోరీ.... కొంచెంతో మొదలుపెట్టి సాంతం తినేస్తాం. .  బటర్‌ చికెన్‌ చూడగానే నోట్లో నీళ్లు ఊరతాయి.  మోతీచూర్‌ లడ్డూ మనసు లాగేస్తుంది. అయితే ఇవి నిజమైన వంటకాలు కాదని తెలిస్తే...కొందరు లాక్‌ డౌన్‌ సమయంలో వినూత్నంగా ఆలోచించి భారతీయ వంటకాల్లో ప్రసిద్ధిగాంచిన కొన్నింటిని కేకుల రూపంలో తయారుచేశారు

Updated : 04 Jul 2021 06:18 IST

కచోరీ.... కొంచెంతో మొదలుపెట్టి సాంతం తినేస్తాం.. బటర్‌ చికెన్‌ చూడగానే నోట్లో నీళ్లు ఊరతాయి. మోతీచూర్‌ లడ్డూ మనసు లాగేస్తుంది. అయితే ఇవి నిజమైన వంటకాలు కాదని తెలిస్తే...కొందరు లాక్‌ డౌన్‌ సమయంలో వినూత్నంగా ఆలోచించి భారతీయ వంటకాల్లో ప్రసిద్ధిగాంచిన కొన్నింటిని కేకుల రూపంలో తయారుచేశారు. ఇవి అచ్చం వంటకాల్లా ఉండి నోరూరిస్తున్నాయి కదూ. కచోరీలు, సమోసాలు, మోతీచూర్‌ లడ్డూ, చికెన్‌ టిక్కా, గులాబ్‌ జామ్‌ కేక్‌.. ఇంకా మరెన్నో దేశీ వంటకాలను కేకుల రూపంలో తియ్యగా ఆస్వాదించొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు పుట్టినరోజున సర్‌ప్రైజ్‌ కానుకగా అందించొచ్చు. ఏమంటారు..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని