అల్లంతో ఆరోగ్యం!

చారు, రసం, రకరకాల కూరలు, సూప్‌లు... ఇలా వంటకాల రుచిని మరింత పెంచడానికి అల్లం ముక్కలో, తురుమో జత చేస్తాం. కేవలం రుచినే కాదు. ఇది అనేక ఔషధ గుణాలనూ అందిస్తుంది. మరి దీని వల్ల కలిగే ఆరోగ[్య ప్రయోజనాలేంటో చూద్దామా..

Updated : 04 Jul 2021 06:12 IST

చారు, రసం, రకరకాల కూరలు, సూప్‌లు... ఇలా వంటకాల రుచిని మరింత పెంచడానికి అల్లం ముక్కలో, తురుమో జత చేస్తాం. కేవలం రుచినే కాదు. ఇది అనేక ఔషధ గుణాలనూ అందిస్తుంది. మరి దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దామా..

* అల్లంలో అనేక పోషకాలతోపాటు విటమిన్‌-సి, ఇ, మాంగనీస్‌, ఐరన్‌, మెగ్నీషియం ఉంటాయి.
* నోటి దుర్వాసనను పోగొడుతుంది. చెడు బ్యాక్టీరియాను చంపేసి దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
* అల్లానికి కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్వభావం ఉంటుంది. ఇది రక్తనాళాలను శుభ్రంచేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
* జీర్ణశక్తిని పెంచుతుంది.
* ఇది యాంటీఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరం ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా కాపాడుతుంది.
* దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శ్వాస సంబంధ సమస్యలు దూరంగా ఉంటాయి. జలుబు, దగ్గు లాంటివి దరిచేరవు.
* వికారం, వాంతులను తగ్గిస్తుంది.
* ఎముకల ఆరోగ్యమే కాదు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుంది.
* రెండు చెంచాల అల్లం రసం, చెంచా తేనె కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే శరీరంపై వచ్చిన దద్దుర్లు తగ్గిపోతాయి. అలాగే జలుబు, దగ్గు తగ్గుముఖం పడతాయి.
* అల్లం, మిరియాల పొడి, పచ్చకర్పూరం కలిపి సెనగల పరిమాణంలో ఉండలుగా చేసి ఎండబెట్టాలి. విరోచనాలయ్యే సమయంలో వీటిని తీసుకుంటే తగ్గుముఖం పడతాయి. ఈ ఉండలను తీసుకుంటే అరికాళ్లు, అరిచేతుల తిమ్మిర్లు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని