రవ్వ జామూన్‌

పాలు- అర లీటరు, బొంబాయి రవ్వ- 200 గ్రా., చక్కెర- కప్పు, యాలకుల పొడి- అర చెంచా, వంటసోడా- చిటికెడు, నెయ్యి- పెద్ద చెంచా, నూనె- తగినంత.

Published : 11 Jul 2021 01:04 IST

పాఠక వంట

కావాల్సినవి: పాలు- అర లీటరు, బొంబాయి రవ్వ- 200 గ్రా., చక్కెర- కప్పు, యాలకుల పొడి- అర చెంచా, వంటసోడా- చిటికెడు, నెయ్యి- పెద్ద చెంచా, నూనె- తగినంత.

తయారీ: ముందుగా చక్కెరను పాకం పట్టి పక్కన పెట్టుకోవాలి.

పొయ్యి వెలిగించి బాండీ పెట్టి పాలు మరిగించాలి. ఇప్పుడు మంటను చిన్నగా చేసి పాలలో కొద్దికొద్దిగా రవ్వ వేస్తూ గట్టిగా అయ్యేవరకు కలుపుతూ ఉండాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసి రవ్వ ముద్ద గోరువెచ్చగా అయ్యేవరకు చల్లార్చాలి.

ఇప్పుడు ముద్దలో నెయ్యి, చిటికెడు వంటసోడా వేసి పది నిమిషాలపాటు బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ఉండలుగా లేదా జామూన్‌ ఆకారంలో చేసుకోవాలి. వీటిని కాగే నూనెలో వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు డీప్‌ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించిన రవ్వ ఉండల్ని గోరువెచ్చని చక్కెర పాకంలో వేసి, యాలకుల పొడి కలిపి రెండు గంటలపాటు నానబెట్టాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని