తవా రోస్ట్‌ చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌

చికెన్‌ లెగ్స్‌- నాలుగు, ఉప్పు-తగినంత, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు చెంచాల చొప్పున, ధనియాల పొడి, గరంమసాలా- చెంచా చొప్పున, పసుపు- చిటికెడు, పెరుగు- కప్పు, నిమ్మరసం-పెద్ద చెంచా, నూనె- రెండు పెద్ద చెంచాలు, ఆరెంజ్‌ కలర్‌- పావు చెంచా.

Updated : 14 Oct 2022 10:34 IST

చెఫ్‌ ప్రత్యేకం

కావాల్సినవి: చికెన్‌ లెగ్స్‌- నాలుగు, ఉప్పు-తగినంత, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు చెంచాల చొప్పున, ధనియాల పొడి, గరంమసాలా- చెంచా చొప్పున, పసుపు- చిటికెడు, పెరుగు- కప్పు, నిమ్మరసం-పెద్ద చెంచా, నూనె- రెండు పెద్ద చెంచాలు, ఆరెంజ్‌ కలర్‌- పావు చెంచా.

తయారీ:  చికెన్‌ లెగ్స్‌ను శుభ్రంగా కడిగి గాట్లు పెట్టాలి. ఆ తర్వాత గిన్నెలో వేసుకుని తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి ముద్ద, గరంమసాలా, నిమ్మరసం, ఆరెంజ్‌ కలర్‌ వేసి చికెన్‌ లెగ్స్‌కి పట్టించాలి. ఈ మిశ్రమాన్ని గంటసేపు నానబెట్టాలి.

నాన్‌స్టిక్‌ తవాలో నూనె వేసి వేడిచేయాలి. అందులో చికెన్‌ లెగ్స్‌ వేసి మంటను మధ్యస్థంగా పెట్టి అయిదు నుంచి పది నిమిషాలపాటు వేయించుకోవాలి. ఇప్పుడు చిన్నమంటపై లెగ్‌ పీసెస్‌ను అన్నివైపులా తిప్పుతూ పావుగంటపాటు రోస్ట్‌ అయ్యేవరకు వేయించాలి. వేగిన చికెన్‌ డ్రమ్‌ స్టిక్స్‌ను వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి

తయారీ: చికెన్‌ లెగ్స్‌ను శుభ్రంగా కడిగి గాట్లు పెట్టాలి. ఆ తర్వాత గిన్నెలో వేసుకుని తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి ముద్ద, గరంమసాలా, నిమ్మరసం, ఆరెంజ్‌ కలర్‌ వేసి చికెన్‌ లెగ్స్‌కి పట్టించాలి. ఈ మిశ్రమాన్ని గంటసేపు నానబెట్టాలి.

నాన్‌స్టిక్‌ తవాలో నూనె వేసి వేడిచేయాలి. అందులో చికెన్‌ లెగ్స్‌ వేసి మంటను మధ్యస్థంగా పెట్టి అయిదు నుంచి పది నిమిషాలపాటు వేయించుకోవాలి. ఇప్పుడు చిన్నమంటపై లెగ్‌ పీసెస్‌ను అన్నివైపులా తిప్పుతూ పావుగంటపాటు రోస్ట్‌ అయ్యేవరకు వేయించాలి. వేగిన చికెన్‌ డ్రమ్‌ స్టిక్స్‌ను వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని