పనస తొనల హల్వా

పనస తొనలు- పది, బెల్లం తురుము- అర కప్పు, కొబ్బరి తురుము- ముప్పావు కప్పు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, డ్రైఫ్రూట్స్‌- గుప్పెడు, యాలకుల పొడి- చెంచా.

Updated : 25 Jul 2021 01:57 IST

పాఠక వంట

కావాల్సినవి: పనస తొనలు- పది, బెల్లం తురుము- అర కప్పు, కొబ్బరి తురుము- ముప్పావు కప్పు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, డ్రైఫ్రూట్స్‌- గుప్పెడు, యాలకుల పొడి- చెంచా.

తయారీ: పనస తొనలను మిక్సీలో వేసి గుజ్జు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడి చేసి డ్రైఫ్రూట్స్‌ను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే పనస తొనల గుజ్జును వేసి చిన్నమంపై కాసేపు వేయించాలి. మరో గిన్నెలో బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఉడికించిన గుజ్జులో పోసి కలపాలి. దీనికి కొబ్బరి తురుము జత చేయాలి. మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. చివరగా  డ్రైఫ్రూట్స్‌, యాలకుల పొడి వేస్తే సరి.

- మాధవీ లత, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని