ఔషధాల కొమ్మ.. కరివేపాకు!

కూరలోనో, చారులోనో కరివేపాకు రాగానే తీసి పక్కన పెట్టేస్తాం. అయితే మనకు విరివిగా దొరికే ఈ ఆకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

Updated : 08 Aug 2021 03:36 IST

కూరలోనో, చారులోనో కరివేపాకు రాగానే తీసి పక్కన పెట్టేస్తాం. అయితే మనకు విరివిగా దొరికే ఈ ఆకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేంటో తెలుసుకుందామా..

* దీన్ని నేరుగా, పొడి, కషాయం, పచ్చడి, స్మూథీ... ఇలా పలు రకాలుగా తీసుకోవచ్చు.

* బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామంతోపాటు రోజూ గుప్పెడు తాజా కరివేపాకు తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. ఈ ఆకుల్లోని ‘కార్బొజోల్‌ ఆల్కలాయిడ్స్‌’ ఇందుకు ఉపయోగపడతాయి.

* ఈ ఆకులు మధుమేహుల్లో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.

* దీనిలోని విటమిన్‌-ఎ వల్ల క్రమం తప్పకుండా తీసుకుంటే కంటి ఆరోగ్యం బాగుంటుంది. ఈ ఆకులను వాసన చూడటం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.

* కరివేపాకులోని ‘కార్బొజోల్‌ ఆల్కలాయిడ్స్‌’ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి. ఈ సమ్మేళనాలు యాంటీబయాటిక్‌, యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి.

* గర్భిణులు రోజూ తీసుకోవడం వల్ల వాంతులు వికారం  తగ్గడమే కాకుండా రక్తహీనత సమస్యా రాకుండా చూసుకోవచ్చు.

* కరివేపాకును రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాదు జుట్టు నెరవకుండా ఇది అడ్డుకుంటుంది.

* రోజూ గుప్పెడు కరివేపాకు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే అల్జీమర్స్‌ లాంటి వ్యాధులు రాకుండా ఇది రక్షణ కల్పిస్తుంది.

* కరివేపాకులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు చక్కటి రక్షణ కల్పిస్తాయి.

* దీన్ని రోజూ తింటే రక్తంలోని కొలెస్ట్రాల్‌ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. దాంతో గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు.

* ఆడవారిలో రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు, విరేచనాలు, గనేరియా, ఒళ్లు నొప్పులు తగ్గించడానికి కరివేపాకు పనికొస్తుంది. ఈ ఆకుల్లో క్యాల్షియం ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఎముక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని