ముక్క పాడవకుండా!

సగం నిమ్మకాయ ముక్కను వాడి మిగతా సగాన్ని అక్కడే వదిలేస్తాం. కాసేపటికది ఎండిపోవడమో, వడలిపోవడమో జరుగుతుంది. దాంతో పారేస్తాం.

Updated : 15 Aug 2021 05:37 IST

గం నిమ్మకాయ ముక్కను వాడి మిగతా సగాన్ని అక్కడే వదిలేస్తాం. కాసేపటికది ఎండిపోవడమో, వడలిపోవడమో జరుగుతుంది. దాంతో పారేస్తాం. అలా కాకుండా మిగిలిపోయిన పండ్లు, కూరగాయల ముక్కలను తాజాగా ఉంచుకోవడం కోసం తయారుచేసిందే ‘సావల్‌’ అనే ఈ పరికరం. అర, పావు, ముప్పావు పండ్ల/కూరగాయల ముక్కలను సాగే గుణం ఉన్న ఈ పరికరంలో ఉంచి దాని ఆకారానికి తగ్గట్లుగా క్లిప్‌ పెట్టి నిల్వ చేసుకోవచ్చు. దీనికి ఉండే సిలికాన్‌ స్ట్రాప్‌ పండ్ల ముక్కను అదిమి పట్టి గాలి పోకుండా చాలాకాలంపాటు తాజాగా ఉండేలా చేస్తుంది. ఈ పరికరాన్ని శుభ్రం చేయడం కూడా సులువే. దీన్ని ఉపయోగించి ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికం, నిమ్మ, నారింజ, కివి, సంత్రా, యాపిల్‌... ఇలా  అన్ని ముక్కలను తాజాగా భద్రపరుచుకోవచ్చు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని