సరికొత్త కప్‌ హోల్డర్‌...

ఉదయం పేపరు చదువుతూనో, ఏదో లెక్కల పద్దు రాసుకుంటూనో తాగుతున్న కాఫీ కప్‌ను పక్కన పెడతాం. కాసేపటికి ఆ విషయమే మరిచిపోతాం. పొరపాటున మన చేయే తగిలి కాఫీ అంతా నేలపాలవుతుంది. చాలామందికి పలు సందర్భాల్లో ఇలా జరిగే ఉంటుంది.

Updated : 22 Aug 2021 06:07 IST

దయం పేపరు చదువుతూనో, ఏదో లెక్కల పద్దు రాసుకుంటూనో తాగుతున్న కాఫీ కప్‌ను పక్కన పెడతాం. కాసేపటికి ఆ విషయమే మరిచిపోతాం. పొరపాటున మన చేయే తగిలి కాఫీ అంతా నేలపాలవుతుంది. చాలామందికి పలు సందర్భాల్లో ఇలా జరిగే ఉంటుంది. మరి అలాకాకుండా పెట్టిన కప్‌ పెట్టినట్లే కదలకుండా ఉండాలంటే.... అలాంటి సౌలభ్యాన్ని కల్పిస్తోంది సరికొత్త కప్‌ హోల్డర్‌ ‘స్పింక్‌’. దీని అడుగున ఉన్న రేపర్‌ను తీసేసి కావాల్సిన చోట పెడితే చాలు ఆ ఉపరితలానికి అతుక్కుపోతుందీ కప్‌ హోల్డర్‌. దీంట్లో మీకు కావాల్సిన టీ/కాఫీ కప్‌, పండ్లరసం గ్లాసు, కూల్‌డ్రింక్‌ టిన్‌ పెట్టుకోవచ్చు. ఇది పెట్టిన చోట నుంచి చేయి తగిలించినా అంగుళం కూడా కదలకుండా స్థిరంగా ఉంటుంది. ద్రవాలూ ఒలికిపోవు. దాంతో మీరు కూర్చొనే చోటున ఉండే పేపర్లు, ముఖ్యమైన కాగితాలన్నీ భద్రంగా, శుభ్రంగా ఉంటాయి మరి. దీన్ని కడిగి, ఆరబెట్టి మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ఏమంటారు! బాగుంది కదూ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని