సువాసనల ఇలాచీ!

లేత ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులు ఆహారానికి సువాసనలను అందించడమే కాదు మనకు బోలెడు ప్రయోజనాలనూ కలిగిస్తాయి. స్వీట్లు, హాట్లు... ఇలా అన్ని రకాల వంటకాల్లో వాడే దీనివల్ల కలిగే లాభాలెన్నో.

Updated : 22 Aug 2021 06:08 IST

లేత ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులు ఆహారానికి సువాసనలను అందించడమే కాదు మనకు బోలెడు ప్రయోజనాలనూ కలిగిస్తాయి. స్వీట్లు, హాట్లు... ఇలా అన్ని రకాల వంటకాల్లో వాడే దీనివల్ల కలిగే లాభాలెన్నో.

*యాలకుల్లోని ఔషధ గుణాలు తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణమయ్యేలా చేస్తాయి.

* వీటిలోని రసాయనాలు నోటి దుర్వాసనను తగ్గించడమే కాకుండా హానికారక బ్యాక్టీరియాను నశింపజేస్తాయి.

* వీటిలో మాంగనీస్‌, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, జింక్‌ ఖనిజాలు మెండుగా ఉంటాయి. అలాగే పీచు కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. విటమిన్‌-సి, బి6, రైబోఫ్లేవిన్‌, థయామిన్‌ తగిన మోతాదులో ఉంటాయి.

* శ్వాస సంబంధ సమస్యలకు చెక్‌ పెడతాయి.

*జీవక్రియలను పెంచి కాలేయాన్ని కాపాడతాయి.

*ఇలాచీలను ఆహారంలో చేర్చుకుంటే ఆకలి పెరుగుతుంది.

*వీటిలోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  

* రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తాయి.

* ఈ దినుసుల్లోని సుగంధ పరిమళాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ప్రశాంతతను చేకూరుస్తాయి. దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

*వీటిలోని పీచు మలబద్ధకం సమస్య రాకుండా చూస్తుంది.

*చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు  ఆహారంలో వీటిని చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి.

* మూత్ర సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. ఉదర సంబంధ సమస్యలను చెక్‌ పెడతాయి.  

* జుట్టు చక్కగా పెరగడంలో ఇవి తోడ్పడతాయి. చివర్లు చిట్లడం, ఊడిపోవడం సమస్యలను అదుపు చేస్తాయి.

*శరీరంలోని వాపులను నియంత్రిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని