నోరూరించే ముల్లంగి చపాతీ

కావాల్సినవి: గోధుమపిండి- రెండు కప్పులు, ముల్లంగి తురుము- కప్పు, జీలకర్ర- అరచెంచా, కారం- చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద- అర చెంచా, ఉప్పు, నీళ్లు, నూనె, నెయ్యి- తగినంత.

Updated : 29 Aug 2021 00:46 IST

కావాల్సినవి: గోధుమపిండి- రెండు కప్పులు, ముల్లంగి తురుము- కప్పు, జీలకర్ర- అరచెంచా, కారం- చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద- అర చెంచా, ఉప్పు, నీళ్లు, నూనె, నెయ్యి- తగినంత.
తయారీ: గిన్నెలో గోధుమ పిండి, ముల్లంగి తురుము, ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్ర వేసి పిండిని కలపాలి. సహజంగానే ముల్లంగిలో నీరు ఉంటుంది కాబట్టి కాసిన్ని నీళ్లు పోస్తే సరిపోతుంది. చివరగా కొద్దిగా నూనె పోసి బాగా కలిపి పావుగంట పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత చపాతీల్లా చేసుకుని పెనంపై వేసి, రెండువైపులా నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. ఇవి టొమాటోసాస్‌, గ్రీన్‌ చట్నీతో తింటే చాలా బాగుంటాయి.

- అంజన, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని