చిటికెలో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌

మీకు ఇప్పుడే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినాలని ఉందా... అయితే మీ దగ్గర ఈ చిన్నపాటి గ్యాడ్జెట్‌ ఉంటే సరిపోతుంది. దీంతో పొటాటో ఫ్రైస్‌కి కావాల్సిన ఆలు ముక్కలను సులువుగా కోసేయొచ్చు..

Published : 29 Aug 2021 00:41 IST

మీకు ఇప్పుడే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినాలని ఉందా... అయితే మీ దగ్గర ఈ చిన్నపాటి గ్యాడ్జెట్‌ ఉంటే సరిపోతుంది. దీంతో పొటాటో ఫ్రైస్‌కి కావాల్సిన ఆలు ముక్కలను సులువుగా కోసేయొచ్చు.. ఈ పరికరంలో రెండు భాగాలుంటాయి. కింది భాగంలో చదరపు ఆకారంలో  పదునైనా బ్లేడుతో కలిసి ఓ గిన్నె ఉంటుంది. దీనిపై ఆలూని పెట్టి మరో గిన్నెతో కాస్త గట్టిగా నొక్కితే పొడవైన ముక్కలు చిటికెలో వచ్చేస్తాయి.
ఈ పరికరంతో కేవలం బంగాళా దుంపనే కాదు క్యారెట్‌, ర్యాడిష్‌, బీట్‌రూట్‌, యాపిల్‌, కీరా... లాంటి కూరగాయలు, పండ్లను కూడా ముక్కలుగా కోసుకోవచ్చు. చీజ్‌నూ తరగొచ్చు. దీన్ని శుభ్రం చేయడం కూడా సులభమే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని