పసిడి పసుపు!

వంటకాల్లో పసుపు వేస్తాం. ఇది వాటికి రంగూ, రుచిని అందిస్తుంది. చిన్న దెబ్బ తగలగానే పసుపు రాస్తాం. జలుబు చేస్తే పసుపు పాలు తాగుతాం... ఇలా దీన్ని ఆహారంగానే కాదు, ఔషధంగానూ వాడతాం. ఇవేకాకుండా దీన్నివల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. 

Published : 12 Sep 2021 02:00 IST

వంటకాల్లో పసుపు వేస్తాం. ఇది వాటికి రంగూ, రుచిని అందిస్తుంది. చిన్న దెబ్బ తగలగానే పసుపు రాస్తాం. జలుబు చేస్తే పసుపు పాలు తాగుతాం... ఇలా దీన్ని ఆహారంగానే కాదు, ఔషధంగానూ వాడతాం. ఇవేకాకుండా దీన్నివల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి.  

* దీంట్లో పోషకాలు చాలా ఎక్కువ. అలాగే పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులుంటాయి. ఐరన్‌, విటమిన్‌-ఎ, బి2, ఇతర మూలకాలూ ఉంటాయి. దీన్ని క్రిమిసంహారిణిగా పిలుస్తారు.

* దీనిలోని ఔషధగుణాలు శరీరంలో వాపులు రాకుండా అడ్డుకుంటాయి.

* దీనిలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్‌ గుణాలుంటాయి. దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు జబ్బుల బారిన పడకుండా చేస్తాయి.

ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే జలుబు, దగ్గు లాంటివి తగ్గుముఖం పడతాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని