తొక్కలతో పచ్చడి

నిమ్మ, మామిడికాయ పచ్చళ్లు తెలుసు. మటన్‌, చికెన్‌లతో చేసే నాన్‌వెజ్‌ పచ్చళ్లూ పరిచయమే. రోటి పచ్చళ్ల గురించి చెప్పక్కర్లేదు. అయితే తమిళనాడులో కమలాపండు తొక్కలతో కూడా పచ్చడి చేస్తారట. కొత్తగా ఉంది కదూ. అదెలా చేస్తారో చూద్దామా..

Published : 19 Sep 2021 02:32 IST

కొబ్బరితో ..

నిమ్మ, మామిడికాయ పచ్చళ్లు తెలుసు. మటన్‌, చికెన్‌లతో చేసే నాన్‌వెజ్‌ పచ్చళ్లూ పరిచయమే. రోటి పచ్చళ్ల గురించి చెప్పక్కర్లేదు. అయితే తమిళనాడులో కమలాపండు తొక్కలతో కూడా పచ్చడి చేస్తారట. కొత్తగా ఉంది కదూ. అదెలా చేస్తారో చూద్దామా..


బెల్లంతో..

ముందుగా పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆరెంజ్‌ తొక్కలు వేసి చిన్న మంటపై కాసేపు వేయించాలి. దీనికి అర చెంచా మెంతిపొడి, కాస్తంత కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి. అలాగే బెల్లం తురుము ముక్కలకు పట్టేలా కలిపి రెండు గంటలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత సర్వ్‌ చేసుకుంటే సరి.
కొబ్బరితో కలిపి...  కమలా తొక్కలను కడాయిలో వేసి వేయించాలి.. దీనికి కాస్తంత నూనెను కూడా కలపొచ్చు. ఇవి వేగి సువాసనలు వచ్చే సమయంలో వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ తొక్కలకు సరిపోయేన్ని ఎండు మిరపకాయలను కూడా నూనెలో వేయించాలి. ఈ రెండింటిని చల్లార్చి మిక్సీజార్‌లో వేసి, దీంట్లో చిన్న నిమ్మకాయ పరిమాణంలో చింతపండును జత చేయాలి. అలాగే ఒకటిన్నర కప్పు పచ్చికొబ్బరి తురుమును కూడా వేయాలి.. తగినంత ఉప్పు, సరిపడా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఈ పోపును తయారుచేసిన పచ్చడిలో వేసి కలిపేయాలి. అంతే రుచికరమైన కమలాపండు తొక్కలతో చేసిన  పచ్చడి రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని