నోరూరించే మాల్పువా

చక్కెర, మైదా- కప్పు చొప్పున, నీళ్లు- ముప్పావు కప్పు, ఆకుపచ్చ యాలకులు- నాలుగు, కుంకుమపువ్వు- కొద్దిగా, నిమ్మరసం- చెంచా, బొంబాయి రవ్వ- పావు కప్పు, సోంపు పొడి- చెంచా,...

Updated : 26 Sep 2021 06:11 IST

కావాల్సినవి: చక్కెర, మైదా- కప్పు చొప్పున, నీళ్లు- ముప్పావు కప్పు, ఆకుపచ్చ యాలకులు- నాలుగు, కుంకుమపువ్వు- కొద్దిగా, నిమ్మరసం- చెంచా, బొంబాయి రవ్వ- పావు కప్పు, సోంపు పొడి- చెంచా, ఉప్పు, బేకింగ్‌ పొడి- చిటికెడు, వెచ్చని పాలు- కప్పున్నర, నూనె/నెయ్యి- వేయించడానికి సరిపడా.

తయారీ: చక్కెరపాకం కోసం... పాన్‌లో ముప్పావు కప్పు నీళ్లు, కప్పు చక్కెర వేసి మంటను మధ్యస్థంగా పెట్టి పాకం తయారుచేసుకోవాలి. యాలకులు, కుంకుమపువ్వు జత చేయాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత నిమ్మరసం వేసి పాకం చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి.

గిన్నెలో పిండి, బొంబాయి రవ్వ వేసుకోవాలి. సోంపు పొడి, పంచదార, చిటికెడు చొప్పున ఉప్పు, బేకింగ్‌ పొడి వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా వెచ్చని పాలు పోస్తూ  పిండిలో ఉండలు లేకుండా చిక్కగా దోశ పిండిలా చేసుకోవాలి. దీన్ని 15 నుంచి 30 నిమిషాలు నానబెట్టాలి.

పొయ్యి వెలిగించి వెడల్పాటి బాణలి పెట్టి నెయ్యి/నూనె వేసుకోవాలి. చిన్న గుంట గరిటెతో పిండిని బిళ్లల్లా వచ్చేలా వేడి నూనెలో పోయాలి. పిండి దానికదే గుండ్రని ఆకారాన్ని ఏర్పరుస్తుంది. మంటను కాస్త తగ్గించి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు రెండువైపులా బాగా కాల్చుకోవాలి. నూనెలో నుంచి తీసిన ఈ మాల్పువాను గోరువెచ్చని చక్కెరపాకంలో వేసి ఒక్కో వైపు దాదాపు అయిదు నిమిషాలపాటు ఉంచాలి. అలాగే స్పాట్యూలాతో రెండు వైపులా నొక్కాలి. ఇప్పుడు నానబెట్టుకున్న మాల్పువాను ప్లేట్‌లోకి తీసుకుని గులాబీ రేకలతో గార్నిష్‌ చేసుకుంటే సరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని