ఆరోగ్యానికి ఆకాకరకాయ

కాలానుగుణంగా లభించే కాయగూరలు, పండ్లలో చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అలాంటి వాటిలో ఆకాకరకాయ కూడా ఒకటి. మరి దీనివల్ల కలిగే లాభాలేంటో చూద్దామా..

Published : 03 Oct 2021 02:42 IST

కాలానుగుణంగా లభించే కాయగూరలు, పండ్లలో చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అలాంటి వాటిలో ఆకాకరకాయ కూడా ఒకటి. మరి దీనివల్ల కలిగే లాభాలేంటో చూద్దామా..

* దీనిలో పోషకాలతోపాటు ఔషధ గుణాలూ ఎక్కువే. పీచు అధిక మొత్తంలోనే ఉంటుంది. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

* ఆకాకరకాయను తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.  దీనిలోని యాంటీలిపిడ్‌ పెరోక్సిడేటివ్‌ సమ్మేళనాలు ధమనుల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

* ఈ కాయల్లోని యాంటీ అలర్జిక్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

* తక్కువ కెలొరీలుండే కూరగాయ ఇది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు దీన్ని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది శరీరానికి కావాల్సిన తేమనూ అందిస్తుంది.

* దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్‌ ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటాయి. ఇది కాలేయాన్ని రక్షించి, కొవ్వు పేరుకు పోకుండా చూస్తుంది.

* ఇందులోని కెరోటినాయిడ్స్‌ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

* ఇవి రక్తంలోని చక్కర స్థాయులను క్రమబద్ధీకరిస్తాయి. కాబట్టి మధుమేహులూ వీటిని తీసుకోవచ్చు.

* మలబద్ధకం ఉన్నవారు దీన్ని ఆహారంలో చేర్చుకుంటే ఆ ఇబ్బంది క్రమంగా తగ్గిపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని