ప్రయోజనాల వెలగ!

కాలానుగుణంగా దొరికేవాటిలో వెలగపండు ఒకటి. దీనిలో చాలా ఔషధ గుణాలుంటాయి. అవేంటో మనమూ తెలుసుకుందామా..

Updated : 10 Oct 2021 05:24 IST

కాలానుగుణంగా దొరికేవాటిలో వెలగపండు ఒకటి. దీనిలో చాలా ఔషధ గుణాలుంటాయి. అవేంటో మనమూ తెలుసుకుందామా..

* ఈ పండులో పిండిపదార్థాలు, ప్రొటీన్లు, బీటాకెరొటిన్‌, థైమిన్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్‌... ఇలా అన్ని రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. 

* ఈ పండు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. మలబద్ధకం సమస్య రాకుండా చేస్తుంది.

* మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

* శ్వాసకోశ ఇబ్బందులను దూరం చేస్తుంది.

* విషపదార్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధిచేస్తుంది. దాంతో కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. 

* రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కాబట్టి మధుమేహులూ తినొచ్చు.

* తక్షణ శక్తిని అందిస్తుంది.

* దీన్ని ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. వాపులను తగ్గిస్తుంది.

* ఇది నోటి పుండ్లని తగ్గిస్తుంది. పాలిచ్చే తల్లులకు చక్కటి ఆహారం.

* ఈ పండుతో పప్పు కూర, పెరుగు పచ్చడి లాంటివి కూడా చేసుకుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని