మిర్చీ సమోసా

కావాల్సినవి: మైదా- రెండు కప్పులు, ఉప్పు, నూనె- తగినంత, ఉడికించిన బంగాళా దుంపలు- రెండు, పెసరపప్పు- అరకప్పు, చాట్‌ మసాలా, మిరప పొడి- పావు చెంచా చొప్పున, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా,

Published : 17 Oct 2021 01:12 IST

కావాల్సినవి: మైదా- రెండు కప్పులు, ఉప్పు, నూనె- తగినంత, ఉడికించిన బంగాళా దుంపలు- రెండు, పెసరపప్పు- అరకప్పు, చాట్‌ మసాలా, మిరప పొడి- పావు చెంచా చొప్పున, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, పచ్చిమిర్చి- రెండు.

తయారీ: మైదాలో ఉప్పు, నూనె వేసి, కొన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె పోసి అది వేడయ్యాక తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. అందులో ఉడికించి మెదిపిన బంగాళాదుంప, పెసరపప్పు, మసాలా పొడులు, తగినంత ఉప్పు వేసి కలిపి అయిదు నిమిషాలు వేయించి, చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి.

మిర్చీని మధ్యలో నుంచి కట్‌ చేసి దాన్నుంచి గింజలన్నీ తీసేయాలి. ఇందులో తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని కూర్చాలి. చపాతీ పిండిని తీసుకుని చపాతీలా చేసి, సన్నగా రోల్‌ చేసుకోవాలి. ఇలా రోల్‌ చేసుకున్న వాటిని    స్ట్రైప్స్‌గా కట్‌ చేసుకోవాలి. ఈ స్ట్రైప్స్‌ని స్టఫ్‌ చేసుకున్న మిర్చీకి చూట్టూ చుట్టాలి.

కడాయిలో నూనె పోసి వేడయ్యాక తయారుచేసి పెట్టుకున్న మిర్చీ వేసి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకు డీప్‌ ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైన చట్నీతో వేడిగా తింటే చాలా బాగుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని