సులభంగా పగలగొట్టొచ్చు!

గుడ్లను పగలగొట్టే సమయంలో చేయి జారి కింద పడిపోవడం, పగిలిపోవడం; సొన చేతులకు అంటుకోవడం లాంటివి సాధారణమే. ఫొటోలో కనిపిస్తోంది ఎగ్‌ ఒపెనర్‌.  ఇది చేతిలో ఉంటే ఆ ఇబ్బందులు

Published : 17 Oct 2021 01:12 IST

గుడ్లను పగలగొట్టే సమయంలో చేయి జారి కింద పడిపోవడం, పగిలిపోవడం; సొన చేతులకు అంటుకోవడం లాంటివి సాధారణమే. ఫొటోలో కనిపిస్తోంది ఎగ్‌ ఒపెనర్‌.  ఇది చేతిలో ఉంటే ఆ ఇబ్బందులు ఉండవిక. చేప ఆకారంలో ఉండే దీంతో గుడ్లను సులభంగా, తేలికగా పగలగొట్టొచ్చు. దీన్ని ఎగ్‌షెల్‌ బ్రేకర్‌, ఎగ్‌ కట్టర్‌ క్రాకర్‌ అని కూడా పిలుస్తారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, ప్లాస్టిక్‌ రకాల్లోనూ లభ్యమవుతుంది. ధర కూడా అందుబాటులోనే ఉంది మరి. శుభ్రం చేయడమూ  సులువే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు