తామర  కాడలతో  పకోడీలు!

వాతావరణం కాస్త చల్లబడిందంటే చాలు. వెంటనే ఆలూనో, మిర్చీనో.. సెనగ పిండిలో ముంచి బజ్జీలో, పకోడీలో వేస్తాం. ఉత్తరాదిన మాత్రం ఇలాంటి సందర్భాల్లో వేయించిన కమల్‌కక్‌డీని ఇష్టంగా తింటారు. అదేంటి అనుకుంటున్నారా?

Updated : 31 Oct 2021 07:02 IST

వాతావరణం కాస్త చల్లబడిందంటే చాలు. వెంటనే ఆలూనో, మిర్చీనో.. సెనగ పిండిలో ముంచి బజ్జీలో, పకోడీలో వేస్తాం. ఉత్తరాదిన మాత్రం ఇలాంటి సందర్భాల్లో వేయించిన కమల్‌కక్‌డీని ఇష్టంగా తింటారు. అదేంటి అనుకుంటున్నారా? తామరపూల కాడలు ఉంటాయిగా... అవే ఈ కమల్‌కక్‌డీలు. వీటిని సన్నని స్లైసుల్లా తరిగి చిప్స్‌లా వేయించు కుంటారు. లేదంటే సెనగపిండిలో ముంచి బజ్జీల్లా వేస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే వీటితో చాలా మంది పచ్చళ్లు పెట్టుకోవడం, కూరలు వండు కోవడం సాధారణం అక్కడ. కశ్మీర్‌, పంజాబ్‌ ప్రాంతాల ప్రత్యేకం ఈ వంట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని