ఊరించే రోజ్‌ లడ్డు

కొబ్బరితురుము- 2కప్పులు, పాలు- ఒకటిన్నర కప్పు, చక్కెర - అరకప్పు, తరిగిన జీడిపప్పు, బాదం పప్పులు- చిన్నగిన్నెతో, యాలకుల పొడి - పావు చెంచా, రోజ్‌ సిరప్‌ - 2 చెంచాలు, రోలింగ్‌ కోసం: మరికాస్త కొబ్బరితురుము. 

Published : 31 Oct 2021 02:27 IST

కావల్సినవి : కొబ్బరితురుము- 2కప్పులు, పాలు- ఒకటిన్నర కప్పు, చక్కెర - అరకప్పు, తరిగిన జీడిపప్పు, బాదం పప్పులు- చిన్నగిన్నెతో, యాలకుల పొడి - పావు చెంచా, రోజ్‌ సిరప్‌ - 2 చెంచాలు, రోలింగ్‌ కోసం: మరికాస్త కొబ్బరితురుము.  

తయారీ: పెద్ద పాన్‌ లేదా కడాయిలో, కొబ్బరి తురుము తీసుకుని, రెండు నిమిషాలు చిన్న మంట మీద వేయించుకోవాలి. దీనికి పాలు కూడా కలిపి తక్కువ మంట మీద ఒక నిమిషం వరకు ఉడికించుకొని, తర్వాత చక్కెర వేసి బాగా కలపాలి. కాసేపటికి ఈ మిశ్రమం నీరుగా మారుతుంది. ఇది గట్టిపడే వరకూ ఉడికించుకోవాలి. దీనిలో రోజ్‌సిరప్‌, జీడిపప్పు, బాదం పలుకులు, యాలకుల పొడివేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారాక లడ్డూల్లా చుట్టి.. ఎండుకొబ్బరిలో దొర్లిస్తే రోజ్‌ కోక్‌నట్‌ లడ్డూలు సిద్ధమవుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని