వంటింట్లో.... నల్లబల్లలు!

ఇంట్లో ఏ సరకులు ఉన్నాయి... ఏవి నిండుకున్నాయి? ఇలాంటివి సమయానికి గుర్తుకురావు. తీరా వండే సమయానికి అవి లేవు.... ఇవి లేవు అనుకుంటూ ఉంటాం. వంటింట్లో ఉన్నప్పుడే ఇలాంటి విషయాలను రిమైండర్లుగా రాసుకొంటే

Published : 31 Oct 2021 02:35 IST

ఇంట్లో ఏ సరకులు ఉన్నాయి... ఏవి నిండుకున్నాయి? ఇలాంటివి సమయానికి గుర్తుకురావు. తీరా వండే సమయానికి అవి లేవు.... ఇవి లేవు అనుకుంటూ ఉంటాం. వంటింట్లో ఉన్నప్పుడే ఇలాంటి విషయాలను రిమైండర్లుగా రాసుకొంటే మర్చిపోతామన్న బాధ ఉండదు. కానీ ఎక్కడ రాస్తాం? నోటుబుక్కులో రాసి, తిరిగి చదివేంత ఓపిక ఉండదు. సెల్‌ఫోన్‌లో ఉన్న రిమైండర్లు చాలవన్నట్టుగా ఇవీ జోడించలేం. అందుకే దీనికో ఉపాయం కనిపెట్టారు మహిళలు. ఫ్రిజ్‌నే బ్లాక్‌ బోర్డుగా మార్చేసుకుంటున్నారు. అదెలా అంటారా? మార్కెట్లో ఫ్రిజ్‌లకు అతికించుకునేందుకు వీలుగా బ్లాక్‌ బోర్డులు.. వాటి మీద రాసేందుకు ప్రత్యేక పెన్నులు దొరుకుతున్నాయి. మెనూలు రాసుకోవడానికీ, అయిపోయిన పచారీ సరకులు గుర్తు చేసుకోవడానికీ ఈ బోర్డులు భలేగా ఉపయోగ పడుతున్నాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని