ఫేస్‌ప్యాక్‌ ఎందుకిక?

చూడచక్కని రంగే కాదు... అమోఘమైన పోషకాలూ కమలాల సొంతం. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఇవి వ్యాధి నిరోధకశక్తిని పెంచడంలో ముందుంటాయి..

Published : 31 Oct 2021 02:39 IST

చూడచక్కని రంగే కాదు... అమోఘమైన పోషకాలూ కమలాల సొంతం. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఇవి వ్యాధి నిరోధకశక్తిని పెంచడంలో ముందుంటాయి..


అవసరం లేదిక: గాయాలని త్వరగా మానేట్టు చేయడంతోపాటు చర్మానికి సాగే గుణాన్ని అందించి ముడతలు రాకుండా చేస్తాయి. యాభై తర్వాతా యౌవ్వనంతో మెరిసిపోవడానికి సహకరిస్తాయి.


పాపాయికోసం: గర్భిణులకు తొలినాళ్లలో ఫొలేట్‌ కీలకమైన పోషకం. ఇది గర్భస్థ శిశువు మానసిక ఎదుగుదలకి సహకరిస్తుంది. కమలాలని సరైన మోతాదులో తినడంవల్ల తల్లీబిడ్డలకు ఫొలేట్‌తోపాటు, కావాల్సినంత బి విటమిన్‌ కూడా అందుతుంది.


గుండెజబ్బు ఎంత ప్రమాదకారో తెలుసు కదా! కమలాల్లోని హెస్పిరిడిన్‌ అనే ఫ్లవనాయిడ్‌ గుండెజబ్బుల నుంచి రక్షణగా ఉంటుంది. వారంలో నాలుగుసార్లయినా ఆరెంజ్‌ని జ్యూస్‌ రూపంలో కానీ నేరుగాగానీ తీసుకోవడం వల్ల రక్తం గడ్డకుండా ఉండి రక్తపోటుపై ఒత్తిడి ఉండదు. 


కాలంలో నిరోధక శక్తి తగ్గి... జలుబు, దగ్గు వంటివి దాడిచేస్తాయి. కమలాలు వాటిని నుంచి రక్షిస్తాయి. చెవి ఇన్‌ఫెక్షన్ల నుంచీ ఉపశమనం కలిగిస్తాయి.


నొప్పులు దూరం: కమలాలు క్యాల్షియానికి పెట్టింది పేరు. కండరాలను ఆరోగ్యంగా ఉంచి... ఎముకలు గుల్ల బారిపోకుండా చూస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని