పీతల పని పట్టేద్దాం!

నాన్‌వెజ్‌ వంటకాల రుచి గురించి మాంసాహార ప్రియులకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రుచి సంగతి సరే... కానీ వాటిని బాగుచేయడమే మహా కష్టం. ముఖ్యంగా పీతల రుచి ఎంత బాగుంటుందో వాటిని బాగు ....

Updated : 07 Nov 2021 00:55 IST

నాన్‌వెజ్‌ వంటకాల రుచి గురించి మాంసాహార ప్రియులకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రుచి సంగతి సరే... కానీ వాటిని బాగుచేయడమే మహా కష్టం. ముఖ్యంగా పీతల రుచి ఎంత బాగుంటుందో వాటిని బాగు చేసి వండటం అంత కష్టం. వాటి పైన పెంకు చాలా బలంగా ఉంటుంది. వాటి నుంచి మాంసాన్ని వేరు చేయాలంటే సరైన పరికరాలు ఉండాల్సిందే. ఇదిగో చేతిలో ఈ క్రాబ్‌ క్రాకర్‌ టూల్స్‌ ఉంటే మీ పని మహా సులువు. ఈ పరికరాలతో పెంకుని వేరు చేయడం... అందులో ఉన్న మాంసాన్ని తీయడం చిటికెలో పని. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయివి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని