భలే బెల్‌పెప్పర్‌!

బెంగళూరు మిర్చీ, క్యాప్సికమ్‌, బెల్‌ పెప్పర్‌... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు దీన్ని. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లోనూ దొరుకుతుంది. మిర్చీ అనే పేరున్నా అంత ఘాటు ఉండదు

Updated : 14 Nov 2021 06:22 IST

బెంగళూరు మిర్చీ, క్యాప్సికమ్‌, బెల్‌ పెప్పర్‌... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు దీన్ని. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లోనూ దొరుకుతుంది. మిర్చీ అనే పేరున్నా అంత ఘాటు ఉండదు. పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి. అవేంటో, వాటి వల్ల లాభాలేంటో తెలుసుకుందామా...

* గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. లైకోపిన్‌ అనే ఫైటోన్యూట్రియంట్‌ ఉంటుందిందులో.

* క్యాప్సికమ్‌ జీవక్రియలను మెరుగుపరుస్తుంది.

* యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-సి మెండుగా ఉండే ఇది రోగనిరోధకతను పెంచడంలో ముందుంటుంది.

* ఇనుము లోపాన్ని తగ్గిస్తుంది.

* ఎరుపు రంగు బెల్‌ పెప్పర్‌లో విటమిన్‌-ఎ మెండుగా ఉంటుంది. ఇది కంటికి మేలు చేస్తుంది.  

* దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు అధికంగా ఉండి క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటాయి.  

* ఇది కెలొరీలను కరిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తీసుకోవచ్చు.

* దీంట్లో విటమిన్‌-బి6, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి ఆందోళనలను తగ్గిస్తాయి. అలాగే కడుపు ఉబ్బరం, హైబీపీని అదుపులో ఉంచుతాయి.

* శరీరంలోని మలినాలను డీటాక్సిఫికేషన్‌ చేసే సమ్మేళనాలుంటాయి దీనిలో.

* ఇందులోని సిలికాన్‌ జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి మంచిది. జుట్టు బాగా పెరగాలంటే క్యాప్సికమ్‌ను ఆహారంలో చేర్చుకోవాల్సిందే. అంతేకాదు చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

* దీనిలోని పొటాషియం నాడులు చక్కగా పనిచేసేలా చూస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

* ఈ మూడు రంగుల్లోని క్యాప్సికమ్‌లలో విటమిన్‌-సి మెండుగా ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని