తక్కువ నూనెను వాడుతుంది!

పాన్‌లో ఎక్కువ నూనె వేయొద్దనుకుంటున్నారా... చికెన్‌, మటన్‌లను మారినేట్‌ చేసే సమయంలో తక్కువ నూనె వాడాలనుకుంటున్నారా... అయితే ఈ కిచెన్‌ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌ మీ కోసమే...

Updated : 28 Sep 2022 15:59 IST

పాన్‌లో ఎక్కువ నూనె వేయొద్దనుకుంటున్నారా... చికెన్‌, మటన్‌లను మారినేట్‌ చేసే సమయంలో తక్కువ నూనె వాడాలనుకుంటున్నారా... అయితే ఈ కిచెన్‌ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌ మీ కోసమే. ప్రాన్స్‌, చికెన్‌, మటన్‌లకు, పేస్ట్రీస్‌కి... ఇలా వివిధ పదార్థాలకు, వస్తువులకు ఆయిల్‌ రాయడానికి ఈ సిలికాన్‌ ఆయిల్‌ బ్రష్‌ చాలా ఉపయోగపడుతుంది.  

గ్లాస్‌ జార్‌తో సహా ఇది లభిస్తుంది. జార్‌లో నూనె పోసి బ్రష్‌ను తిరగేసి  ఇందులో పెడితే సరి. కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు. వేడిని తట్టుకునే మృదువైన సిలికాన్‌ బ్రిజిల్స్‌ వల్ల పాన్‌పై ఎలాంటి గీతలు పడవు. అతుక్కోవు. చేతిలో చక్కగా ఇమిడిపోయే ఈ పరికరాన్ని సులువుగా శుభ్రం చేయొచ్చు కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని