ఆరోగ్యానికిగ్రీన్‌ టీ!

ఔషధ గుణాలున్న గ్రీన్‌టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్‌, అమైనో ఆమ్లాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ టీ  వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూడండి..

Published : 21 Nov 2021 00:33 IST

ఔషధ గుణాలున్న గ్రీన్‌టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్‌, అమైనో ఆమ్లాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ టీ  వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూడండి..

* ఒత్తిడిని తగ్గించి మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది.

* రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే బరువును కూడా. శరీరంలోని కొవ్వును తగ్గించి రక్తప్రసరణ సాఫీగా సాగేలా చూస్తుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తప్పుతుంది.

* జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. చర్మానికి, జుట్టుకు మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

* ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.

* శరీరానికి కావాల్సిన తేమను అందించి డీహైడ్రేట్‌ కాకుండా కాపాడుతుంది.

* పంటి నొప్పిని రాకుండా చేయడమే కాకుండా నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

* జీవక్రియలను వేగవంతం చేస్తుంది. అలాగే కొవ్వులను కరిగించి బరువును తగ్గించడంలో సాయపడుతుంది.

* దీనిలోని యాంటీఆక్సిడెంట్లు హానికారక బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడతాయి.

* శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది. అలర్జీలతో పోరాడుతుంది.

* గ్రీన్‌ టీలోని ఔషధ గుణాల వల్ల చాలా రకాల రుగ్మతలు తగ్గిపోతాయి.

* రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగితే ఆరోగ్యానికి మంచిది. మరెందుకాలస్యం మీరూ మొదలుపెట్టండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు