ఎఫ్‌బీఐ రెస్టారెంట్‌ ప్రయాణాన్ని కాదు.. ఆహారాన్ని అందిస్తుంది!

సాధారణంగా ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సులో ప్రయాణించి గమ్యస్థానం చేరుకుంటాం. అలాగే ఆకలి వేస్తే ఏదో ఒక రెస్టారెంట్‌లో ఇష్టమైన ఫుడ్‌ తింటాం. అయితే ఈ చిత్రంలో కనిపిస్తున్న బస్సు మీ గమ్యస్థానాన్ని చేర్చదు కానీ...

Published : 21 Nov 2021 00:34 IST

సాధారణంగా ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సులో ప్రయాణించి గమ్యస్థానం చేరుకుంటాం. అలాగే ఆకలి వేస్తే ఏదో ఒక రెస్టారెంట్‌లో ఇష్టమైన ఫుడ్‌ తింటాం. అయితే ఈ చిత్రంలో కనిపిస్తున్న బస్సు మీ గమ్యస్థానాన్ని చేర్చదు కానీ... మీకు నచ్చిన పదార్థాలను అందిస్తుంది. దీన్ని దేశంలోనే మొదటి డబల్‌ డెక్కర్‌ బస్సు రెస్టారెంట్‌గా చెబుతారు. ఇది ఎక్కడుందో.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా...

దిల్లీలోని రాజేంద్రప్లేస్‌ మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబరు-2ని ఆనుకుని ఉందీ రెస్టారెంట్‌. దీని పేరు ఫుడ్‌ బస్‌ ఆఫ్‌ ఇండియా. డబల్‌ డెక్కర్‌ బస్సులో దీన్ని పూర్తిగా ఏర్పాటు చేశారు. కింది భాగంలో వంటశాల, క్యాష్‌ కౌంటర్‌ ఉంటాయి. పైభాగంలో పూర్తిగా కస్టమర్లకే కేటాయించారు. ముందుగా బస్‌ బయట కౌంటర్‌లో ఆర్డర్‌ చెయ్యాలి. అక్కడ ఓ గోల్డెన్‌ టికెట్‌ (టోకెన్‌) ఇస్తారు. దీన్ని మీకు కేటాయించిన సీటు దగ్గర అతికించాలి. పిజ్జా, బర్గర్‌, రోల్స్‌, పాస్తా, మీల్స్‌, శాండ్‌విచ్‌, షేక్స్‌... ఇలా అన్నీ లభిస్తాయి. మీరు ఆర్డరు చేసిన ఆహారం రాగానే వెయిటర్‌ ఈ టికెట్‌ను తీసుకువెళతారు. ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. రూ.99 నుంచి మొదలుకుని  మూడు వందల రూపాయల లోపే ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇలా డబల్‌ డెక్కర్‌ బస్‌ రెస్టారెంట్‌ను ఇండియాలోనే మొదటిసారిగా ఏర్పాటు చేయడమే. కొత్తగా ఉంది కదూ. దిల్లీ వెళ్లినప్పుడు ఈ బస్సులో మీరూ నచ్చినవి రుచి చూడండి మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని