కావాల్సినట్టు కట్‌ చేసేస్తుంది!

ఇతర బేకరీ ఐటెమ్స్‌ చేయాలనుకుంటున్నారా... అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న టూల్‌ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రోలింగ్‌ కుకీ కట్టర్‌గా పిలిచే ఈ పరికరంతో పిండిని....

Updated : 28 Nov 2021 06:56 IST

ఇంట్లోనే బిస్కెట్లు, పేస్ట్రీలు... ఇతర బేకరీ ఐటెమ్స్‌ చేయాలనుకుంటున్నారా... అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న టూల్‌ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రోలింగ్‌ కుకీ కట్టర్‌గా పిలిచే ఈ పరికరంతో పిండిని మీకు నచ్చిన ఆకారంలో కట్‌ చేసుకోవచ్చు. పిండిపై ఈ గ్యాడ్జెట్‌తో తిప్పుతుంటే భలేగా అనిపిస్తుంది. మొదట పిండిని చపాతీలా పెద్దగా వెడల్పుగా చేసుకోవాలి. ఈ టూల్‌తో దానిపై మెల్లిగా తిప్పి చదరం, గుండ్రం... ఇలా కావాల్సిన ఆకారాల్లో సులువుగా, చాలా తక్కువ టైమ్‌లో కట్‌ చేయొచ్చు. పేస్ట్రీలు, బిస్కెట్లు, బ్రెడ్‌... ఇలా బేకరీ ఉత్పత్తులు తయారుచేసే సమయంలో గృహిణికి చక్కగా ఉపయోగపడుతుందిది. మూడు సైజుల్లో లభ్యమవుతుంది. ఒకటేమో పిండిని ప్లేన్‌గా, గుండ్రంగా కట్‌ చేస్తే రెండేమో ఆ పిండిని చదరంగా, అంచులకు కొత్త అందాన్ని తెస్తాయి. ఉపయోగించడం, శుభ్రం చేయడం కూడా సులువే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని