ఇక చపాతీ గుండ్రంగా!

అమ్మ చేసే మృదువైన చపాతీలంటే ఇష్టం... అమ్మమ్మ చేత్తో చేసే పోలెలు (బొబ్బట్లు) అంటే మరీ ఇష్టం... అంటూ అనడమేనా మీరూ చక్కగా, గుండ్రంగా చపాతీలు చేయగలరా...

Updated : 26 Dec 2021 05:32 IST

అమ్మ చేసే మృదువైన చపాతీలంటే ఇష్టం... అమ్మమ్మ చేత్తో చేసే పోలెలు (బొబ్బట్లు) అంటే మరీ ఇష్టం... అంటూ అనడమేనా మీరూ చక్కగా, గుండ్రంగా చపాతీలు చేయగలరా...

తరం అమ్మాయిలకు ఇది కాస్త కష్టమైన పనే. ఎందుకంటే ఒక్కో చపాతీ ఒక్కో దేశాన్ని, ఖండాన్ని తలపిస్తూ రావడం మనలో చాలామందికి అనుభవమే. మరి వాటిని గుండ్రంగా చేయడానికి డఫ్‌ రోలింగ్‌ బ్యాగ్‌... అనే ఈ చిన్న గ్యాడ్జెట్‌ సాయపడుతుంది. చక్కగా సిలికాన్‌తో తయారైన ఈ పరికరం రెండు పొరల్లా వస్తుంది. వీటి మధ్యన పిండి ముద్దను పెట్టి కాస్తంత పొడి పిండి చల్లాలి. ఆ తర్వాత బ్యాగ్‌ అంచులను పూర్తిగా మూసేయాలి. ఇప్పుడు చపాతీల కర్రతో మామూలుగా చపాతీలా చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో చిన్నగా, పెద్దగా గుండ్రంగా చేసేసుకోవచ్చు. ఈ బ్యాగు పారదర్శకంగా ఉండటంతో  చపాతీ ఆకారం చక్కగా కనిపిస్తుంది. దీన్ని శుభ్రం చేయడమూ సులువే. చపాతీలే కాదండోయ్‌ పరాఠాలు, కుకీస్‌, పిజ్జాలనూ దీన్ని ఉపయోగించి చేసేయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని