ఫ్లిప్‌ ఇట్‌తో...చివరి బొట్టూ వాడుకోవచ్చు

మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసే తేనె, నూనె, షాంపూ లాంటివి వాడేసి పారేస్తాం. అయితే సీసా చివర్లో ఉండేది మాత్రం పూర్తిగా రాదు దాంతో వదిలేస్తాం. ఈ ఫొటోలో కనిపిస్తోన్న చిట్టి మూత ‘ఫ్లిప్‌ ఇట్‌’తో సీసాలోని ప్రతి బొట్టును ఉపయో గించుకోవచ్చు.

Published : 09 Jan 2022 00:35 IST

మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసే తేనె, నూనె, షాంపూ లాంటివి వాడేసి పారేస్తాం. అయితే సీసా చివర్లో ఉండేది మాత్రం పూర్తిగా రాదు దాంతో వదిలేస్తాం. ఈ ఫొటోలో కనిపిస్తోన్న చిట్టి మూత ‘ఫ్లిప్‌ ఇట్‌’తో సీసాలోని ప్రతి బొట్టును ఉపయో గించుకోవచ్చు. డబ్బులు ఊరికే రావు అనే మాటను నిజం చేస్తూ తయారీదారులు దీన్ని రూపొందించినట్లున్నారు. దీంట్లో స్టాండ్‌, మూత అని భాగాలుంటాయి.. ఈ మూతలు నాలుగైదు సైజుల్లో వస్తాయి. దాదాపు అయిపోతున్న నూనె సీసా మూతను తీసేసి ఈ మూతను పెట్టాలి. దీనికి స్టాండ్‌ను బిగించి సీసాను తలకిందులుగా పెట్టాలి. దాంతో బాటిల్‌లోని చివరి బొట్టూ మూతలోకి పడిపోతుంది. మొత్తం చేరాక దానికి ఉండే మూతను తెరిచి వాడుకోవచ్చు. చాలా బాగుంది కదూ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని